నేనేం చేస్తానంటే!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే.. ముందుగా చాక్లెట్లు తినడం తగ్గిస్తాను. వాటికి బదులు పండ్లు తింటాను. వ్యాయామం చేస్తే ఆరోగ్యం కదా! అందుకోసం నేను రోజూ సైకిల్‌ తొక్కుతాను.

Published : 07 Jan 2022 01:32 IST

చాక్లెట్లు తినడం మానేస్తాను!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే.. ముందుగా చాక్లెట్లు తినడం తగ్గిస్తాను. వాటికి బదులు పండ్లు తింటాను. వ్యాయామం చేస్తే ఆరోగ్యం కదా! అందుకోసం నేను రోజూ సైకిల్‌ తొక్కుతాను. ఇంకా ఫోన్‌ చూడటం తగ్గిస్తాను. వీడియో గేమ్స్‌ ఆడటం మానేస్తాను. అలాగే రోజూ నా పనులన్నీ మా అమ్మ చేస్తుంటుంది. కాబట్టి ఇక మీదట నా పనులు నేనే నేర్చుకుని చేసుకోవాలనుకుంటున్నాను. అస్సలు అల్లరి చేయకూడదని, అన్నం తినేటప్పుడు పేచీ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. పెద్దవాళ్లు చెప్పిన మాట వింటూ మంచి పేరు తెచ్చుకుంటాను.  

- నాళం సాయి హాస,
ఎల్‌కేజీ, విజయవాడ

నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి.

email: hai@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని