నేనేం చేస్తానంటే!

హాయ్‌ ఫ్రెండ్స్‌! కొత్త సంవత్సరంలో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే... రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేస్తాను. పొద్దున లేచేటప్పుడు అస్సలు ఏడవను. స్కూల్‌కి వెళ్లనని మారాం చేయను. అమ్మ చేసే టిఫిన్‌కి వంకలు పెట్టకుండా చక్కగా...

Published : 11 Jan 2022 00:48 IST

చెల్లితో గొడవపడను  
హాయ్‌ ఫ్రెండ్స్‌! కొత్త సంవత్సరంలో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే... రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేస్తాను. పొద్దున లేచేటప్పుడు అస్సలు ఏడవను. స్కూల్‌కి వెళ్లనని మారాం చేయను. అమ్మ చేసే టిఫిన్‌కి వంకలు పెట్టకుండా చక్కగా తినేస్తాను. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే నా హోంవర్క్‌ పూర్తి చేసేస్తాను. టీవీలో నాన్న న్యూస్‌ చూస్తున్నప్పుడు కార్టూన్‌ ఛానల్‌ పెట్టాలని గోల చేయను. చెల్లిని ఏడిపించకుండా తనతో చక్కగా ఆడుకుంటాను. అమ్మానాన్నతో మంచి పిల్ల అనిపించుకుంటాను.

- మన్నం దివ్యాన్షశ్రీ, యూకేజీ, హైదరాబాద్‌  

నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి.
email: hai@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని