అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.
అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
చెప్పుకోండి చూద్దాం..
1. పైన కాకులు దూరని కారడవి. దాని కిందేమో తలుపులున్న రెండు బావులు. ఏంటవి?
2. వెళ్లేటప్పుడు రెండు, వచ్చేటప్పుడు మూడు.. ఏమిటవి?
3. చాచుకుని నట్టింట్లో పడుకుంటుంది. ముడుచుకుని మూలన నిల్చుంటుంది. ఏమిటది?
4. వెలుతురు ఉన్నప్పుడే కనిపిస్తుంది. చీకటి పడగానే మాయమవుతుంది. ఇంతకీ ఏంటది?
నేనెవర్ని?
1. నేనో అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడు అక్షరాలను కలిపితే ‘తిన్నారు’ అనే అర్థం వస్తుంది. చివరి నాలుగు అక్షరాలను కలిపితే ‘ఆలస్యం’ అనే అర్థన్నిస్తా 1, 3, 4 అక్షరాలను కలిపితే ‘కూర్చున్నారు’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవర్నో తెలుసా?
2. నేను నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని. నేను మీ అందరి ఆకలి తీర్చుతాను. 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘చల్లని’ అనే అర్థం వస్తుంది. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
ఆ ఒక్కటి ఏది?
ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.
ఒకటే ఒకటి!
ఆధారాల సాయంతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో నింపండి.
తమాషా ప్రశ్నలు
1. ఆగకుండా నడిస్తే ఏమవుతుంది?
2. కనిపించని వనం ఏది?
3. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?
4. మిసిసిపీ నదిలో ఎక్కువగా ఏమున్నాయి?
నేను గీసిన బొమ్మ!
జవాబులు
అక్షరాల చెట్టు: IDENTIFICATION
అది ఏది : C
చెప్పుకోండి చూద్దాం?: 1.జుట్టు, కళ్లు 2.తాడు, బిందె, నీళ్లు 3.చాప 4.నీడ
నేనెవర్ని?: 1.Slate 2.Rice
ఆ ఒక్కటి ఏది : 1. 456645 (మిగతావాటిలో.. చివరి మూడు అంకెలు, మొదటి మూడు అంకెలకు రివర్స్‌లో ఉన్నాయి)
2. 124 (మిగతావాటిలో.. మొదటి రెండు అంకెలను కూడితే మూడోది వస్తుంది)
ఒకటే ఒకటి!: 1.కోడి 2.కోటి 3.కోతి 4.కోట 5.కోక
తమాషా ప్రశ్నలు: 1.ఆయాసం వస్తుంది 2.పవనం 3.విసనకర్ర 4.‘సి’ అనే అక్షరాలు
తప్పులే తప్పులు: ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ఒక్కో తప్పుంది. వాటిని గుర్తించి సరిచేసి రాయండి?
1.ఉపాధ్యాయుడు 2.లేఖాస్త్రం 3.అస్త్రసన్యాసం 4.శ్మశానం 5.మనోహరి 6.శమంతకమణి 7.అనాథ 8.అణ్వస్త్రం 9.గ్రంథాలయం 10.శీతాకాలం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Taraka Ratna: మరిన్ని పరీక్షల తర్వాత తారకరత్న ఆరోగ్యంపై స్పష్టత
-
Sports News
Suryakumar Yadav : ఇది ‘స్కై’ భిన్నమైన వెర్షన్ : తన ఇన్నింగ్స్‌పై సూర్య స్పందన ఇది..
-
Crime News
Kothagudem: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్ బాలికలు?
-
Movies News
Rajinikanth: ‘వీర సింహారెడ్డి’ దర్శకుడికి రజనీకాంత్ ఫోన్ కాల్.. ఎందుకంటే?
-
Sports News
Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..
-
World News
H1b Visa: మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ