డేటా కేంద్రాలతో రియల్‌ విస్తరణ

డేటా కేంద్రాల విస్తరణతో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో 2026 నాటికి డేటా కేంద్రాల సామర్థ్యం 791 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా

Published : 08 Jun 2024 01:49 IST

ఈనాడు, హైదరాబాద్‌ : డేటా కేంద్రాల విస్తరణతో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో 2026 నాటికి డేటా కేంద్రాల సామర్థ్యం 791 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. దీంతో 10 మిలియన్‌ చదరపు అడుగుల నిర్మాణాలకు డిమాండ్‌ ఉంటుందని చెబుతున్నారు. 5.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. 

నిర్మాణ రంగంలో గృహాలు, కార్యాలయాలు, మాల్స్, రిటైల్, హోటల్స్, గోదాములతో పాటూ డేటా కేంద్రాలు ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌లో భాగం. డిజిటల్‌ శకంలో ఏఐ రాకతో డేటా కేంద్రాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని.. అందుకు తగ్గట్టుగా తమ సామర్థ్యాలను క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల్బుసీఎస్‌ప్శీ విస్తరిస్తున్నాయి. 

  • 2023 ద్వితీయార్ధంలో డేటా కేంద్రాల సామర్థ్యాల విస్తరణలో 12 శాతం వృద్ధి కన్పించింది. 81 మెగావాట్లకు పెరిగింది. ఇదేకాలంలో 2022 ద్వితీయార్ధంలో 72 మెగావాట్లుగా ఉంది. మధ్యలో కొంత విరామం తర్వాత ఊపందుకోవడం ఈ వృద్ధికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
  • డిజిటల్‌ శకం కారణంగా 2019లో 350 మెగావాట్ల నుంచి 2023 నాటికి 854 మెగావాట్లకు డేటా కేంద్రాల సామర్థ్యం విస్తరించింది. రాబోయే సంవత్సరాల్లో గ్లోబల్‌ డేటా హబ్‌గా భారత్‌ నిలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముంబయి తర్వాత హైదరాబాద్‌ వైపే సీఎస్‌పీలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డేటా కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే పలు సంస్థల కేంద్రాలు ప్రాంతీయ వలయ రహదారి పరిసర ప్రదేశాల్లో ఉన్నాయి. మరిన్ని సంస్థల రాకతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. వీటి రాకతో ఆయా ప్రాంతాల రియాలిటీ వృద్ధికి దోహదం చేస్తుంది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని