అమ్మడానికి పట్టే సమయం తగ్గింది

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సరఫరా పెరిగింది. మరి డిమాండ్‌ ఏ రకంగా ఉంది? మార్కెట్‌లో నిర్మాణం పూర్తై అమ్మకుండా మిగిలిన యూనిట్ల్బుఇన్వెంటర్శీ పెరిగాయి.

Published : 08 Jun 2024 01:45 IST

మార్కెట్లో ఇన్వెంటరీ పెరిగినా విక్రయాలు మెరుగ్గా 

ఈనాడు, హైదరాబాద్‌ : రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సరఫరా పెరిగింది. మరి డిమాండ్‌ ఏ రకంగా ఉంది? మార్కెట్‌లో నిర్మాణం పూర్తై అమ్మకుండా మిగిలిన యూనిట్ల్బుఇన్వెంటర్శీ పెరిగాయి. మరి విక్రయాలు ఎలా ఉన్నాయి? దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు అధికం. గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు భారీ ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. ఏటా ఈ నగరాల్లో ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగుతోంది.  ఐదేళ్లుగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఈ నగరాల్లో ఇన్వెంటరీ మార్చి 2024 నాటికి 4.68 లక్షలకు చేరుకుంది. 24 శాతం ఇన్వెంటరీ పెరిగిందని జెఎల్‌ఎల్‌ నివేదిక పేర్కొంది. ఇన్వెంటరీ పెరిగినా.. గతంతో పోలిస్తే వీటి విక్రయాలకు పడుతున్న సమయం తగ్గడం విశేషం. 2019 ఆఖరులో ఇన్వెంటరీ విక్రయాలకు సగటున 32 నెలలు పడితే.. ఇప్పుడు 22 నెలల్లోనే విక్రయించగలుగుతున్నారు. ఇది కొంత ఊరట. గత ఎనిమిది త్రైమాసికాల సగటు గణాంకాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించినట్లు జెఎల్‌ఎల్‌ తెలిపింది. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లను ఇందులో కలపలేదని.. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లనే యూనిట్లుగా తీసుకున్నట్లు తెలిపింది. 

ప్రీమియం విభాగంలో.. : గృహ నిర్మాణంలో సరసమైన, బడ్జెట్, మధ్యస్థాయి, విలాసవంతమైన ఇళ్ల ప్రాజెక్ట్‌లు చేపడుతుంటారు. తక్కువ నెలల్లోనే విక్రయిస్తున్న వాటిలో ప్రీమియం ప్రాజెక్ట్‌లు ముందువరసలో ఉన్నాయి. కోటిన్నర నుంచి మూడు కోట్ల రూపాయల ధరల శ్రేణిలో ఫ్లాట్ల విక్రయాలకు గతంలో 51 నెలలు పడితే ఇప్పుడు 29 నెలలకు తగ్గిందని నివేదిక పేర్కొంది. ః రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల ధరలు పలికే ఫ్లాట్ల విక్రయానికి సగటున 21 నెలలు పడుతుంది. గతంలో ఇది 29 నెలలుగా ఉండేది. 

బెంగళూరులో వేగంగా.. 

దేశంలోని అన్ని నగరాలతో పోలిస్తే బెంగళూరులో అతి తక్కువగా 13 నెలల వ్యవధిలోనే ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దిల్లీలో 14 నెలలు, కోల్‌కతాలో 15 నెలలు పడుతున్నట్లు తెలిపాయి. దిల్లీ రాజధాని పరిధిలో గుర్గావ్, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, గజియాబాద్, ఫరిదాబాద్‌ ప్రాంతంలో గతంలో ఇన్వెంటరీ విక్రయానికి 48 నెలలు పడితే ఇప్పడదని 14 నెలలకు తగ్గింది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని