దక్షిణానికి వాలు ఉంటే ఇల్లు కట్టుకోవచ్చా?

స్థలం వాలు ఎప్పుడూ తూర్పువైపు గానీ, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు గానీ ఉండవచ్చు. అంటే వర్షపు నీరు ప్రవహిస్తున్నప్పుడు తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తరం వైపు ప్రవహించాలి. అలాకాకుండా వ్యతిరేకంగా ఉంటే...

Published : 30 Aug 2016 20:21 IST

దక్షిణానికి వాలు ఉంటే ఇల్లు కట్టుకోవచ్చా?

మా స్థలానికి తూర్పు దిక్కునుంచి వీధి శూల తగులుతోంది. స్థలానికి ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కువ వాలు ఉంది. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయవచ్చా?

- నారాయణ, హైదరాబాద్‌

  స్థలం వాలు ఎప్పుడూ తూర్పువైపు గానీ, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు గానీ ఉండవచ్చు. అంటే వర్షపు నీరు ప్రవహిస్తున్నప్పుడు తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తరం వైపు ప్రవహించాలి. అలాకాకుండా వ్యతిరేకంగా ఉంటే, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. స్థలానికి ఏ దిక్కులోనూ వీధి శూల తగలకూడదు. ముఖ్యంగా ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంలో అసలు తగలరాదు. అందువల్ల మీరు ఎంచుకున్న స్థలం మంచిది కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని