Coconut: కొబ్బరిబొండం.. దివ్య ఔషధం

వేసవి తాపానికి విరుగుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. అంతేనా.. నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, వికారం, వేడిచేయడం, అరికాళ్ల మంటలు..

Published : 26 May 2024 00:36 IST

వేసవి తాపానికి విరుగుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. అంతేనా.. నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, వికారం, వేడిచేయడం, అరికాళ్ల మంటలు.. ఇలా ఎన్నిటికో దివ్య ఔషధం కొబ్బరిబొండం. ఇందులో ఏమేం సుగుణాలున్నాయో చూద్దాం..
కొబ్బరి నీళ్లలో ప్రొటీన్లు, పీచు, చక్కెర, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, భాస్వరం ఉన్నందున శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వెంటనే శక్తి వస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల పనితీరు మెరుగవుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. చర్మం పొడిబారదు, నేవళంగా ఉంటుంది. ఊబకాయం రాదు. కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అన్నిటినీ మించి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. తియ్యటి కొబ్బరినీళ్లని ఎక్కువమంది అలాగే తాగుతారు. భిన్నమైన రుచి కావాలనుకునేవాళ్లు.. పండ్లరసాలు లేదా నిమ్మరసం కలిపి తాగొచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని