చెరకు రసం పాయసం

చెరకు రసం- లీటరు, ఆకుపచ్చ ఇలాచీపొడి- అర చెంచా, బాస్మతి బియ్యం- 200 గ్రా., నెయ్యి- రెండు చెంచాలు, తరిగిన బాదం, వాల్‌నట్‌- రెండు పెద్ద చెంచాల చొప్పున...

Updated : 05 Sep 2021 06:22 IST

కావాల్సినవి:  చెరకు రసం- లీటరు, ఆకుపచ్చ ఇలాచీపొడి- అర చెంచా, బాస్మతి బియ్యం- 200 గ్రా., నెయ్యి- రెండు చెంచాలు, తరిగిన బాదం, వాల్‌నట్‌- రెండు పెద్ద చెంచాల చొప్పున, ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఎండిన గులాబీ రేకలు- పెద్ద చెంచా చొప్పున, కుంకుమపువ్వు- కొద్దిగా, నీళ్లు- కప్పు.

తయారీ: బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక బాదం, కిస్‌మిస్‌, వాల్‌నట్‌, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెరకు రసాన్ని పాన్‌లో పోసి మరిగించాలి. ఇది మరిగే సమయంలో బియ్యాన్ని వేసి పదిహేను నిమిషాలు మంటను మధ్యస్థంగా పెట్టి కలుపుతూ ఉండాలి.

ఆ తర్వాత ఇలాచి పొడి వేయాలి. పాయసం అడుగంటకుండా చిన్నమంటపై గరిటెతో కలుపుతూనే ఉండాలి. కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోయొచ్చు. అన్నం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఆ తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్‌, నానబెట్టుకున్న కుంకుమపువ్వు, గులాబీ రేకలు వేసి మరో నిమిషం ఉడికించాలి. అంతే తియ్యటి, రుచికరమైన చెరకు పాయసం రెడీ.  దీన్ని వేడి వేడిగా లేదా చల్లచల్లగానూ తినొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని