బిస్కెట్‌ కావాలా!

ఎప్పుడూ మార్కెట్‌లో దొరికే బిస్కెట్లేనా... ఈసారి మీరూ ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చిన్నారులకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో చేస్తే ఇష్టంగా తింటారు.

Updated : 26 Sep 2021 05:58 IST

ఎప్పుడూ మార్కెట్‌లో దొరికే బిస్కెట్లేనా... ఈసారి మీరూ ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చిన్నారులకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో చేస్తే ఇష్టంగా తింటారు. అందుకోసం ఉపయోగపడేదే ఈ బిస్కెట్‌ మేకర్‌. గన్‌ ఆకారంలో ఉన్న దీన్ని కేక్‌ డెకొరేటర్‌లానూ వాడుకోవచ్చు. దీని సాయంతో ఇంట్లోనే రకరకాల ఆకృతుల్లో, సైజుల్లో బిస్కెట్లను తయారుచేసుకోవచ్చు. దాదాపు పదికి పైగా డిజైన్లు ఇందులో ఉన్నాయి. దీంట్లో క్రీమ్‌ నింపి కేక్స్‌పై మీకు నచ్చిన విధంగా డిజైన్స్‌ వేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్‌, అల్యూమినియం, సిలికాన్‌ రకాల్లో దొరుకుతుంది. దీని ఉపయోగించడం, శుభ్రం చేయడం కూడా సులువే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని