కప్‌ కేక్‌.. చేసేద్దామా!

చిన్నారులకు చిటికెలో ఏదైనా వెరైటీ చేసి పెట్టాలా... అది రుచిగా, యమ్మీగా ఉండాలా.. అయితే వెనిల్లా ఫ్లేవర్డ్‌ కేక్‌ ప్రయత్నించి చూడండి. 

Published : 17 Oct 2021 01:12 IST

చిన్నారులకు చిటికెలో ఏదైనా వెరైటీ చేసి పెట్టాలా... అది రుచిగా, యమ్మీగా ఉండాలా.. అయితే వెనిల్లా ఫ్లేవర్డ్‌ కేక్‌ ప్రయత్నించి చూడండి.

కప్పులో నాలుగు పెద్ద చెంచాల మైదా, రెండు పెద్ద చెంచాల చక్కెర పొడి, పావు చెంచా బేకింగ్‌ పౌడర్‌,  చిటికెడు ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మూడు పెద్ద చెంచాల పాలు, పెద్ద చెంచా నూనె, వెనిల్లా పావు చెంచా వేసి బాగా కలపాలి. వాటిపై చాకో చిప్స్‌ వేసి నిమిషంపాటు అవెన్‌లో మీడియం హీట్‌పై పెట్టాలి. అంతే రుచికరమైన  వెనిల్లా కప్‌ కేక్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని