మీకు లెక్కలొచ్చా

కెలడోస్కోపిక్‌ గొట్టంలోని తొంగిచూసినప్పుడు కనిపించే అద్దాల్లా... జిగేల్‌ మంటున్న రంగులతో కనిపిస్తున్న వీటిని కేకులు అంటే నమ్మడం కష్టమే. కెక్‌లాపిస్‌ సరావక్‌ అని పిలిచే ఈ కేకులని తయారుచేయడం అందరి వల్లా సాధ్యం కాదు.

Updated : 24 Oct 2021 06:22 IST

కెలడోస్కోపిక్‌ గొట్టంలోని తొంగిచూసినప్పుడు కనిపించే అద్దాల్లా... జిగేల్‌ మంటున్న రంగులతో కనిపిస్తున్న వీటిని కేకులు అంటే నమ్మడం కష్టమే. కెక్‌లాపిస్‌ సరావక్‌ అని పిలిచే ఈ కేకులని తయారుచేయడం అందరి వల్లా సాధ్యం కాదు. ఎందుకంటే వీటిని తయారీకి కేవలం బేకింగ్‌ నైపుణ్యాలుంటే సరిపోదు. గణితశాస్త్ర పరిజ్ఞానంతో పాటు అపారమైన ఓపికా కావాలి మరి. మలేషియాలోని సరావక్‌ ప్రాంతం ఈ కెక్‌లాపిస్‌ కేకులకు ప్రసిద్ధి. ప్రకృతి సిద్ధమైన రంగులని మాత్రమే వాడి... ముందుగా వేసుకున్న చిత్రాలు, లెక్కల సాయంతో వీటిని తయారుచేస్తారు. వివిధ రంగుల లేయర్‌లని కలపడం... లేయర్ల విషయంలో ఎక్కడా తప్పు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కో కేకు తయారీకి సుమారుగా 8 గంటలు పడుతుందట. అక్కడి ప్రభుత్వం ఈ కేకులకి భౌగోళిక గుర్తింపుని కూడా ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన కేకులుగా వీటిని పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని