భలే రుచి... తూత్తుకుడి మాకరూన్స్‌!

హైదరాబాద్‌ అంటే బిర్యానీ గుర్తొచ్చినట్టు... కాకినాడ అంటే కాజాలు నోరూరించినట్టు... తమిళనాడులోని తూత్తుకుడి అంటే మాకరూన్స్‌ గుర్తొస్తాయి. సాధారణంగా మాకరూన్స్‌ గుండ్రంగా బిస్కెట్లలా ఉండి మధ్యలో...

Updated : 07 Nov 2021 00:57 IST

హైదరాబాద్‌ అంటే బిర్యానీ గుర్తొచ్చినట్టు... కాకినాడ అంటే కాజాలు నోరూరించినట్టు... తమిళనాడులోని తూత్తుకుడి అంటే మాకరూన్స్‌ గుర్తొస్తాయి. సాధారణంగా మాకరూన్స్‌ గుండ్రంగా బిస్కెట్లలా ఉండి మధ్యలో బాదంతో చేసిన ఫిల్లింగ్‌ ఉంటుంది. కానీ తూత్తుకుడి మాకరూన్స్‌ కాస్త భిన్నం. ఇవి తెల్లగా, కోన్‌ ఆకృతిలో ఉంటాయి. బ్రిటిష్‌ వాళ్లకంటే పూర్వం ఈ ప్రాంతాన్ని డచ్‌, పోర్చుగీస్‌ వాళ్లు పాలించినప్పుడు... స్థానిక వంటవాళ్ల సాయంతో వీటిని తయారు చేయించుకుని తినే వాళ్లు. అలా ఈ వంటకం క్రమంగా రూపు మారింది. అదిరిపోయే రుచితో ఉండే ఈ మాకరూన్స్‌పై అక్కడి బేకరీలు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. గుడ్డు, పంచదార, జీడిపప్పు మాత్రమే వాడి చేసే వీటిని వారసత్వంగా కొన్ని కుటుంబాలే చేయడంతో ఇప్పటికీ అది ఓ సీక్రెట్‌ వంటకంగానే మిగిలిపోయింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని