కేక్‌తో... ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

పుట్టినరోజు, వార్షికోత్సవాలు అయితే కేక్‌, గిఫ్ట్‌లు విడివిడిగా తీసుకువెళతాం. రెంటినీ కలిపితే ఎలా ఉంటుంది అనుకున్నారు సృజనకారులు. సాధారణ కేక్‌ తియ్యటి రుచులను అందిస్తుంది....

Updated : 14 Nov 2021 06:24 IST

పుట్టినరోజు, వార్షికోత్సవాలు అయితే కేక్‌, గిఫ్ట్‌లు విడివిడిగా తీసుకువెళతాం. రెంటినీ కలిపితే ఎలా ఉంటుంది అనుకున్నారు సృజనకారులు. సాధారణ కేక్‌ తియ్యటి రుచులను అందిస్తుంది. అయితే ఈ ఫొటోలో కనిపిస్తోన్న కేక్‌ మాత్రం తీపితోపాటు కానుకనూ ఇస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన కేక్‌ స్టాండును రూపొందించారు. దీనిపై మామూలుగానే కేక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని కింద ఉండే స్తూపాకార గొట్టం ద్వారా  మీ ప్రియమైనవారికి సర్‌ప్రైజ్‌గా బహుమతిని అందివ్వొచ్చు. స్టాండుకు కింద ఉన్న మీట సాయంతో కేక్‌ మధ్య భాగం నుంచి కానుకతో ఉండే ప్రత్యేకమైన గాజు గ్లాసు బయటకు వస్తుంది. ఆ సమయంలో చక్కటి సంగీతమూ వినిపిస్తుంది. ఇందులో చాక్లెట్లు, బిస్కట్లలాంటి వాటితోపాటు ఫోన్‌, ఇయర్‌ రింగ్స్‌, చైన్‌ లాంటి వాటిని బహుమతిగా ఇవ్వొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని