స్మాష్‌ బర్గర్‌

కావాల్సినవి: మటన్‌ పాట్టీస్‌- పావుకిలో మటన్‌ కీమా (దీన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గుండ్రంగా బాల్స్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.  వాటిని పాట్టీస్‌ చేసేటప్పటికీ బాగా చల్లగా ఉండాలి.)...

Updated : 28 Nov 2021 06:47 IST

కావాల్సినవి: మటన్‌ పాట్టీస్‌- పావుకిలో మటన్‌ కీమా (దీన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గుండ్రంగా బాల్స్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.  వాటిని పాట్టీస్‌ చేసేటప్పటికీ బాగా చల్లగా ఉండాలి.) ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి- చెంచా చొప్పున,  వెన్న- కొద్దిగా, చీజ్‌ స్లైస్‌లు- కొన్ని.

బర్గర్‌ సాస్‌ .. మూడొంతుల మయోనీజ్‌లో చెంచా మెంతులు కలిపి బర్గర్‌ సాస్‌ తయారు చేసుకోవాలి.  

టాపింగ్స్‌... నాలుగు బర్గర్‌ బన్స్‌, రెండు కప్పుల ఐస్‌ బర్గ్‌ రకం లెట్యూస్‌, పెద్ద టొమాటో, అరముక్క ఉల్లిపాయ, రెండు దిల్‌ పికిల్స్‌ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి) అవసరమవుతాయి.  

తయారీ: బన్నులకు ఒక వైపు వెన్న రాసి పెనంపై గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంపై మంటను మధ్యస్థంగా చేసి ఫ్రిజ్‌లో నుంచి తీసిన మూడు, నాలుగు మీట్‌ బాల్స్‌ను వేయాలి. అన్ని బాల్స్‌ కవర్‌ అయ్యేలా పర్చమెంట్‌ పేపర్‌ కప్పి మీట్‌ మ్యాషర్‌ సాయంతో మీట్‌ బాల్స్‌ పలుచగా పాట్టీస్‌ అయ్యే వరకు మ్యాష్‌ చేయాలి. మీట్‌పై నుంచి పేపర్‌ తీసి జ్యూస్‌ రావడం మొదలయ్యాక ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేయాలి. కింది భాగం బాగా ఉడికిన తర్వాత పాట్టీస్‌ను తిప్పి మరోవైపు కూడా క్రిస్పీగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పాట్టీస్‌ పై చద్దర్‌చీజ్‌ స్లైస్‌ ఉంచాలి. ఒక పాట్టీపై చీజ్‌ స్లైస్‌ ఉంచి దానిని మరో పాట్టీస్‌తో కవర్‌ చేసుకోవాలి. ఇలా ఎనిమిది మీట్‌ బాల్స్‌ని నాలుగు సెట్ల పాట్టీస్‌గా చేసుకోవాలి. ఒక బర్గర్‌ బన్‌ తీసుకుని బటర్‌తో ఫ్రై చేసిన భాగంపై బర్గర్‌ సాస్‌ రాసుకోవాలి. దానిపై 3 దిల్‌ పికిల్‌ పీసెస్‌ ఉంచాలి. ఇప్పుడు తాజా లెట్యూస్‌ ఆకులు చేత్తో చించి దానిపై ఉంచాలి. ఈ ఆకులపై టొమాటో ముక్కలు, ఉల్లిపాయ చక్రాలు ఉంచాలి. వాటిపై ఇందాక తయారుచేసి పెట్టుకున్న డబుల్‌ పాట్టీస్‌ని ఉంచాలి. ఆపై మరో బర్గర్‌ బన్‌ పెడితే మన స్మాష్‌ బర్గర్‌ రెడీ. దీన్ని చికెన్‌తో కూడా చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని