Coffee: ఎప్పుడు కావాలన్నా కమ్మని.. కాఫీ

ముక్కుపుటాలని హాయిగా పలకరించే కాఫీ పరిమళం ఒక్కసారి అలవాటైందా... ఇక అంతే! వదల్లేం. మంచి కాఫీ కలపడం ఒక ఆర్ట్‌ అంటారు. ఆ కెమిస్ట్రీ కుదరడం అందరికీ సాధ్యం కాదు.

Updated : 11 Dec 2022 07:12 IST

ముక్కుపుటాలని హాయిగా పలకరించే కాఫీ పరిమళం ఒక్కసారి అలవాటైందా... ఇక అంతే! వదల్లేం. మంచి కాఫీ కలపడం ఒక ఆర్ట్‌ అంటారు. ఆ కెమిస్ట్రీ కుదరడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఒకేలా ఉండే కాఫీని అందించాలనుకున్నారు కొమిటీర్‌ సంస్థను స్థాపించిన మాథ్యూరాబర్ట్స్‌. ఇందుకోసం తొమ్మిదేళ్లు కష్టపడి ఫ్రీజింగ్‌ కాఫీని తయారుచేశారు. ఈ కాఫీని కలపడానికి ఎక్కువ సమయం పట్టదు. బరిస్తా కాఫీ రుచిని ఇంట్లోనే పక్కాగా అందించేందుకు ఆధునిక బ్రూయింగ్‌ టెక్నిక్‌ నైపుణ్యాలని పాటించి ఈ కాఫీని తయారుచేసింది కొమిటీర్‌ సంస్థ. ఈ ఆలోచన నచ్చడంతో ఇన్వెస్టర్లు కోట్ల రూపాయలని పెట్టుబడిగా అందించారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎనిమిది రకాల కాఫీ గింజలతో తయారుచేసిన ఈ ఫ్రీజింగ్‌ కాఫీ... మనకి బిళ్లల రూపంలో దొరుకుతుంది. కాఫీ కావాలనుకున్నప్పుడు పాలల్లో కలిపితే సరి. అన్నట్టు ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ ఆవిష్కరణల్లో దీన్ని ఒకటిగా టైమ్‌ పత్రిక పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని