అందంగా తరిగేద్దాం!

వంటని ఒక ఆర్ట్‌లా భావించి కళాత్మకంగా వండేవాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లకి దొండకాయ నుంచి, క్యారట్‌ ముక్కల వరకూ ప్రతిదీ సమానంగా, అందంగా కనిపించాలి.

Updated : 22 Jan 2023 02:43 IST

వంటని ఒక ఆర్ట్‌లా భావించి కళాత్మకంగా వండేవాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లకి దొండకాయ నుంచి, క్యారట్‌ ముక్కల వరకూ ప్రతిదీ సమానంగా, అందంగా కనిపించాలి. అలా కనిపించాలంటే అందుకు ప్రత్యేకమైన పరికరాలుండాలి కదా! అలాంటి వారికి ఉపయోగపడేదే ష్రెడ్‌ సిల్క్‌ నైఫ్‌. దీంతో ఉల్లిపొరక, దొండకాయలు, బీరకాయలు వేటినైనా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో, సమాన ముక్కలుగా కత్తిరించుకోవచ్చు. దీనిని అడ్డంగా ఉపయోగిస్తే ఎక్కువ ముక్కలు కత్తిరించుకోవచ్చు. అదే నిలువుగా వాడితే దోసకాయలు, క్యారెట్లు వంటి వాటిని సలాడ్స్‌లోకి సన్నని నూడుల్స్‌లా తరుక్కోవచ్చు. మీ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చక్కని వంటింటి ఆయుధం ఇది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు