కోల్డ్‌ కాఫీ రుచిగా..!

నాకు కోల్డ్‌ కాఫీ అంటే చాలా ఇష్టం. బయటకెళ్లినప్పుడు తాగుతుంటా. ఇంట్లో చేసుకోవాలని ఉంది.

Published : 19 Feb 2023 00:11 IST

నాకు కోల్డ్‌ కాఫీ అంటే చాలా ఇష్టం. బయటకెళ్లినప్పుడు తాగుతుంటా. ఇంట్లో చేసుకోవాలని ఉంది. ఏవైనా చిట్కాలుంటే చెప్పండి?

వర్ణిక, కూకట్‌పల్లి

మండే ఎండల్లో కోల్డ్‌ కాఫీ చల్లగానే కాదు రుచిగానూ ఉంటుంది. ఇందుకోసం ఇన్‌సెంట్‌ కాఫీ పొడి- చెంచా, వెచ్చని నీరు- కప్పు, చక్కెర- నాలుగు చెంచాలు, చిక్కటి పాలు చల్లనివి- రెండు కప్పులు, ఐస్‌ క్యూబ్స్‌- ఎనిమిది, చాక్లెట్‌ ఐస్‌ క్రీమ్‌ (టాపింగ్‌)కోసం- రెండు స్కూప్‌లు తీసుకోవాలి.

తయారీ: బ్లెండర్‌లో ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడి, చక్కెర, గోరువెచ్చని నీటిని వేసి నురగ వచ్చేంతవరకూ అర నిమిషం పాటు బ్లెండ్‌ చేయాలి. ఆ తర్వాత ఐస్‌ క్యూబ్స్‌ వేసుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల చల్లని పాలు పోసుకొని మళ్లీ రెండు నిమిషాలపాటు బ్లెండ్‌ చేసుకోవాలి. గ్లాసులో పాలు పోసుకొని పైన చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌తో టాపింగ్‌ చేసుకుని కోల్డ్‌ కాఫీ సర్వ్‌ చేసుకోవాలి. దీని తయారీలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వీలైనంతవరకూ బ్రాండెడ్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడినే ఉపయోగించాలి. అలాగే గ్రైండ్‌ చేసిన చెకోరి పొడిని కలిపితే బాగుంటుంది. చెకొరీకి బదులుగా మాపుల్‌ సిరప్‌, తేనె వంటి స్వీటనర్లని కూడా వాడుకోవచ్చు. స్ట్రాంగ్‌ కాఫీ రుచి కోసం 2 చెంచాల కాఫీపొడిని వేయొచ్చు. మిక్సీలో బ్లెండ్‌ చేసేటప్పుడు విప్పింగ్‌ క్రీమ్‌ వేయాలి. అలాగే మిల్క్‌షేక్‌ లాంటి రుచికోసం ఒక స్కూప్‌ వెనిల్లా ఐస్‌క్రీంని వేసుకోవచ్చు.

చెఫ్‌ మల్లేశ్వర్‌, కాంటినెంటల్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని