మతిమరుపు రాకుండా..!

వంట రుచిగా చేయడంతోపాటు..  అది ఆరోగ్యాన్ని కాపాడేలా వండటం చాలా ముఖ్యం అంటోంది మాస్టర్‌ చెఫ్‌ 2 విజేత షిప్రా ఖన్నా.

Published : 12 Mar 2023 00:13 IST

వంట రుచిగా చేయడంతోపాటు..  అది ఆరోగ్యాన్ని కాపాడేలా వండటం చాలా ముఖ్యం అంటోంది మాస్టర్‌ చెఫ్‌ 2 విజేత షిప్రా ఖన్నా. ఆమె రాసిన సూపర్‌ ఫుడ్స్‌ ఫర్‌ ఆసమ్‌ మెమరీ పుస్తకంలోని కొన్ని చిట్కాలు కూడా చెబుతోంది..

సాంకేతిక యుగంలో మన ఫోన్‌లకి మెమరీ పెంచుతున్నాం. వాటితో పాటు మన జ్ఞాపకశక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం ఆహారంలో ఎముకలతో చేసే సూపులు, ఎక్‌స్ట్రా వర్జిన్‌ ఆలివ్‌ఆయిల్‌, చేపలు, రోజ్‌మేరీఆయిల్‌ వంటివి చేర్చుకుంటే మతిమరుపు రాకుండా ఉంటుంది. వీటి నుంచి శరీరం పూర్తిస్థాయిలో పోషకాలని గ్రహిస్తుంది. రాత్రి నానబెట్టిన బాదంపప్పులు తింటే మరీ మంచివి.

మంచి నిద్ర, వ్యాయామంతోపాటు... ఒమెగా త్రీ కొవ్వులుండే చేపలు తినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. ఎక్‌స్ట్రావర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌లోని పాలీఫినాల్స్‌ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయసు ప్రభావాన్ని తగ్గిస్తాయి. అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. బ్లూబెర్రీస్‌... మతిమరుపు సమస్యల్ని దూరంగా ఉంచుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని