కుక్‌ సర్వర్‌ క్లీనర్‌.. అన్నీ తానై!

సాధారణంగా టీనేజ్‌లో ఉన్న కుర్రాడంటే- సినిమాలూ షికార్లతో కాలక్షేపాలు.. లేదంటే జల్సాలతో డబ్బు వృథా చేస్తారు. కానీ.. కోల్‌కతాకి చెందిన పంతొమ్మిదేళ్ల సాగర్‌ అలా కాదు.

Published : 03 Mar 2024 00:36 IST

సాధారణంగా టీనేజ్‌లో ఉన్న కుర్రాడంటే- సినిమాలూ షికార్లతో కాలక్షేపాలు.. లేదంటే జల్సాలతో డబ్బు వృథా చేస్తారు. కానీ.. కోల్‌కతాకి చెందిన పంతొమ్మిదేళ్ల సాగర్‌ అలా కాదు. తండ్రి అకస్మాత్తుగా చనిపోతే.. కుటుంబ బాధ్యత తలకెత్తుకున్నాడు. అతడి తండ్రి వీధిలో భోజన బండి నడిపేవాడు. దాన్ని మూసేసి.. ఏదైనా ఉద్యోగంలో చేరమని సలహా ఇచ్చారు చాలామంది. కానీ ఆ కుర్రాడు తండ్రి జ్ఞాపకంగా దాన్నే కొనసాగించాలనుకున్నాడు. భోజన బండి తీసేసి.. అక్కడే చిన్న పందిరి వేశాడు. వండి, వడ్డించడం దగ్గర్నుంచి భోజనాల బల్ల శుభ్రం చేయడం, ఎంగిలి పాత్రలు కడగటం.. కుక్‌, సర్వర్‌, క్లీనర్‌ ఇలా.. అన్ని పనులూ చేసేస్తూ, అందరి మన్ననలూ అందుకుంటున్నాడు. ‘ఓకే శుభో’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో వైరలై దాదాపు లక్ష లైక్స్‌తో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. కుర్రాడి పనితీరు, నిబ్బరం చూసి.. సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని