బరువు పెరగనీయదు..

క్యాలీఫ్లవర్‌ లానే క్యాబేజ్‌ మంచి పోషకాహారం. ఇందులో విటమిన్లు, ఫొలేట్‌, మాంగనీస్‌, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పీచు, గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, ఐరన్‌, భాస్వరం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌..

Published : 03 Mar 2024 00:40 IST

క్యాలీఫ్లవర్‌ లానే క్యాబేజ్‌ మంచి పోషకాహారం. ఇందులో విటమిన్లు, ఫొలేట్‌, మాంగనీస్‌, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పీచు, గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, ఐరన్‌, భాస్వరం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌.. ఇలా అనేక పోషకాలు ఉన్నాయి. క్యాబేజ్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు నొప్పి, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది మంచి బ్యాక్టీరియాను వృద్ధిచేస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్‌ స్థాయిని క్రమబద్ధం చేస్తుంది, రక్తం గడ్డకట్టకుండా, ఇతరత్రా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఊబకాయం రానివ్వదు. రేడియేషన్‌ థెరపీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. క్యాన్సర్‌ను సైతం నిరోధిస్తుంది. క్యాబేజ్‌ రుచికరమే అయినప్పటికీ.. ఒక్కో సీజన్‌లో కాస్త వెగటు వాసన వస్తుంది. అలాంటప్పుడు కూర దించేముందు అరకప్పు పాలు పోస్తే ఆ వాసన పోవడమే కాకుండా అదనపు రుచి వస్తుంది. కొందరు కూరల్లో గ్రేవీ కోసం ఉల్లికి బదులుగా క్యాబేజ్‌ వాడుతున్నారు. దీన్ని కూరగానే కాదు.. సలాడ్‌, సూప్‌ రూపాల్లోనూ తినొచ్చు. దీంతో చేసే పకోడీ సూపర్‌గా ఉంటుంది. క్యాబేజ్‌లో బ్రసెల్స్‌, కింగ్‌ క్యాబేజ్‌, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగుల క్యాబేజ్‌- ఇలా చాలానే రకాలున్నాయి. బలాన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చే క్యాబేజ్‌ని తరచూ తిందామా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని