డైనింగ్‌ టేబుల్‌ తళతళలాడుతుంది!

డైనింగ్‌ టేబుల్‌ శుభ్రం చేయడం కాస్త విసుగైన పనే. టీ, కాఫీ, కూర, చారు.. ఏది తొలికినా జిడ్డుగా తయారవుతుంది. అలా మురిగ్గా ఉంటే భరించలేం కదూ! ఈ సమస్యకు నివారణగా వచ్చిందే ‘హెవీ డ్యూటీ టేబుల్‌ టాప్‌ కవర్‌’.

Updated : 10 Mar 2024 00:12 IST

డైనింగ్‌ టేబుల్‌ శుభ్రం చేయడం కాస్త విసుగైన పనే. టీ, కాఫీ, కూర, చారు.. ఏది తొలికినా జిడ్డుగా తయారవుతుంది. అలా మురిగ్గా ఉంటే భరించలేం కదూ! ఈ సమస్యకు నివారణగా వచ్చిందే ‘హెవీ డ్యూటీ టేబుల్‌ టాప్‌ కవర్‌’. బల్ల సైజు, ఆకారాన్ని బట్టి కవర్‌ వేసేందుకు పేపర్ని కట్‌ చేసి ఇస్తారు. తెచ్చి అతికించుకుంటే సరిపోతుంది. ఇది పల్చగా ఉంటుంది కనుక టేబుల్‌ అందం ఎంతమాత్రం తగ్గదు. పీవీసీ మెటీరియల్‌తో తయారైన ఈ మ్యాట్‌ తళతళా మెరుస్తుంది, ఎక్కువ కాలం మన్నుతుంది కూడా. దీన్ని తుడవటమూ తేలికే. బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని