బలాన్నీ ఆరోగ్యాన్నీ ఇచ్చే బూడిదగుమ్మడి!

బూడిదగుమ్మడికాయ.. కొందరు దీన్ని గుమ్మానికి కడతారు. ఇంకొందరు దీనితో వడియాలు పెడతారు. అంతకుమించి దీని గురించి మనకు పెద్దగా తెలియదు. నిజానికి ఇందులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

Updated : 10 Mar 2024 12:53 IST

బూడిదగుమ్మడికాయ.. కొందరు దీన్ని గుమ్మానికి కడతారు. ఇంకొందరు దీనితో వడియాలు పెడతారు. అంతకుమించి దీని గురించి మనకు పెద్దగా తెలియదు. నిజానికి ఇందులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. బూడిదగుమ్మడిలో పీచు, జింక్‌, క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, సి-విటమిన్‌, ప్రొటీన్లు విస్తారంగా ఉన్నాయి. ఇది మేలుచేసే బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. అల్సర్లకు ఔషధంలా పనిచేస్తుంది. శ్వాస ఇబ్బందులను తొలగిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్య తలెత్తదు. బరువు పెరగకుండా కాపాడుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. టాక్సిన్లను నిరోధిస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి, వాపులను తగ్గిస్తాయి. ఇది జలుబు, జ్వరం, దగ్గు వంటి సాధారణ సమస్యలు మొదలు డిప్రెషన్‌, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బూడిదగుమ్మడి రసంలో చెంచా నెయ్యి కలిపి తాగితే స్వర ఇబ్బందులు తొలగుతాయి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వీటి గింజల పొడిని నూనెలో మరిగించి తలకు రాసుకుంటే.. బట్టతల, చుండ్రు, తలనొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్ని పోషకాలు, ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని తెలిశాక బూడిదగుమ్మడిని నిర్లక్ష్యం చేయగలమా?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని