చిటికెలో చాయ్‌..

మనలో చాలామందిమి చాయ్‌ ప్రియులమే. కానీ ప్రయాణాల్లో కొన్నిసార్లు టీ దొరకదు. దొరికినా శుభ్రత ఉండదు.

Published : 17 Mar 2024 00:04 IST

నలో చాలామందిమి చాయ్‌ ప్రియులమే. కానీ ప్రయాణాల్లో కొన్నిసార్లు టీ దొరకదు. దొరికినా శుభ్రత ఉండదు. అలాంటప్పుడు మనమే సూపర్‌ టీ చేసుకునే టెక్నిక్‌ తెలుసా?! కప్పు టీ పొడి, రెండు కప్పుల పంచదార, కప్పున్నర మిల్క్‌ పౌడర్‌, పావు చెంచా యాలకుల పొడి, అర చెంచా డ్రైజింజర్‌ పౌడర్‌ వేసి మిక్సీ పట్టండి. ఈ పౌడర్‌ని తడి లేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకోండి. ప్రయాణాల్లో ఈ పొడితో పాటు ఫ్లాస్క్‌లో వేడినీళ్లు తీసుకెళ్తే చాలు.. గంట గంటకీ రుచికరమైన చాయ్‌ తాగొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని