దయచేసి బిల్‌ ఇవ్వకండి!

ఈ రోజుల్లో స్కూల్‌ పిల్లల దగ్గర్నుంచి పండు వృద్ధుల వరకూ ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టడం సాధారణం. దాని గురించి మాట్లాడేదేం లేదు. ఆ ఆర్డర్‌తో పాటు ‘ఉల్లిపాయ ససేమిరా వద్దు’, ‘మా శునకానికి నిద్ర చెడిపోతే కష్టం..

Published : 17 Mar 2024 00:15 IST

రోజుల్లో స్కూల్‌ పిల్లల దగ్గర్నుంచి పండు వృద్ధుల వరకూ ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టడం సాధారణం. దాని గురించి మాట్లాడేదేం లేదు. ఆ ఆర్డర్‌తో పాటు ‘ఉల్లిపాయ ససేమిరా వద్దు’, ‘మా శునకానికి నిద్ర చెడిపోతే కష్టం.. నిశ్శబ్దంగా డెలివరీ చేయండి’, ‘కెచప్‌ ప్యాకెట్లు కాసిని అదనంగా ఇచ్చెదరుగాక’ తరహా కామెంట్లు చూస్తే నవ్వొస్తుందని అడపాదడపా డెలివరీ బాయ్స్‌ విషయాలు లీక్‌ చేస్తుంటారు. తాజాగా ఓ కస్టమర్‌- ‘మా ఇంట్లో శాకాహారం మాత్రమే తినాలనే నియమాన్ని గట్టిగా పాటించాలి. ఇప్పుడు మీరు గానీ బిల్‌ ఇచ్చారంటే తెచ్చిన పదార్థమేంటో పక్కా తెలిసిపోతుంది. కాబట్టి బిల్‌ ఇవ్వొద్దు, చికెన్‌ అని చెప్పొద్దు. పైకం ఆన్‌లైన్‌లో కట్టేస్తాను’ అంటూ జొమాటోతో అనుసంధానమైన హోటల్‌కి విజ్ఞప్తి చేశాడు. తమాషాగా ఉంది కదూ! ‘సాహిల్‌ హిలేరియస్‌’ పేరుతో ట్విట్టర్‌లో పోస్టయిన ఈ వార్త కాస్తా వైరలై నవ్వుల పూలు పూయిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని