అరటిపండు ఎంత మంచిదో!

ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో చూడండి..

Updated : 17 Mar 2024 00:38 IST

డాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో చూడండి.. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, రిబోఫ్లేవిన్‌, ఫొలేట్‌, కాపర్‌, పీచు, బి6, సి-విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులను రానివ్వదు. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది.

అరటిపండు మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే నీరసం తగ్గి, తక్షణ శక్తి వస్తుంది. ఇంత మేలు చేసే అరటిపండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది కనుక ఇష్టంగానే తినేయొచ్చు. దీన్ని ఓట్‌మీల్‌, మిల్క్‌షేక్‌, స్మూథీ, సలాడ్స్‌లోనూ వేసుకోవచ్చు, స్వీట్లూ చేయొచ్చు. ఇన్ని లాభాలున్నప్పటికీ.. అలర్జీలు, ఉబ్బసం, సైనస్‌ లాంటి ఇబ్బందులేమైనా ఉండి బాధపడుతుంటే మాత్రం అరటిపండుకు దూరంగానే ఉండాలి.


జాజికాయ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మత్తుమందులా హాని చేస్తుంది. చెవి, ముక్కు, నాలుకల ఘ్రాణ శక్తి తగ్గుతుంది. ఉద్వేగాలు పెరుగుతాయి. మానసిక అనారోగ్యం కలుగుతుంది. దానికి బానిసలవుతారు. ఇన్ని ఇబ్బందులున్నాయని తెలిశాక.. జాజికాయను వీలైనంత తగ్గించడమో, అసలే మానేయడమో చేస్తే మేలు కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని