తెలివైన కోడలుపిల్ల

చపాతీలు చేయడం అన్నం వండినంత సులువేం కాదు. ఒకే మందంలో, ఒకే ఆకృతిలో రావాలంటే.. కొంచెం నెమ్మదిగా, జాగ్రత్తగా చేయాలి.

Updated : 24 Mar 2024 10:44 IST

పాతీలు చేయడం అన్నం వండినంత సులువేం కాదు. ఒకే మందంలో, ఒకే ఆకృతిలో రావాలంటే.. కొంచెం నెమ్మదిగా, జాగ్రత్తగా చేయాలి. దానికి సులువైన మార్గం కనిపెట్టిందో కోడలుపిల్ల. రొట్టెల పీట మీద ఒక్కోటీ కాకుండా వంటింటి పొయ్యి గట్టు మీద గబగబా పొడుగాటి పెద్ద చపాతీ చేసేసింది. ఒక టిఫిన్‌ బాక్స్‌ను తిరగేసి దాని మీద నొక్కి నాలుగు చపాతీలుగా తీసింది. గుండ్రటి చపాతీలు శరవేగంగా తయారైపోయాయి. తక్కిన పిండితోనూ ఇంతే. ఆహా.. ఏం తెలివి! ఈ స్మార్ట్‌ బహురానీని మనం కూడా అనుసరించేద్దామా! ‘రాజ్‌పుట్‌ జోడీ’ అకౌంట్‌లో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో వైరలై దాదాపు 3 కోట్ల వ్యూస్‌ వచ్చాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని