కార్పొరేట్‌ కొలువు కంటే పానీపూరీ బండి బెస్ట్‌!

ఇలాంటి ఆలోచన మనకి చాలాసార్లే వస్తుంటుంది కదూ! స్టాండప్‌ కమెడియన్‌గా మంచి పేరు సంపాదించిన అన్‌మోల్‌ గార్గ్‌ కూడా అదే నిజం అంటున్నారు. అతడలా ప్రకటించేసి ఊరుకోలేదు.

Updated : 07 Apr 2024 04:04 IST

ఇలాంటి ఆలోచన మనకి చాలాసార్లే వస్తుంటుంది కదూ! స్టాండప్‌ కమెడియన్‌గా మంచి పేరు సంపాదించిన అన్‌మోల్‌ గార్గ్‌ కూడా అదే నిజం అంటున్నారు. అతడలా ప్రకటించేసి ఊరుకోలేదు. కార్పొరేట్‌ ఉద్యోగాల కంటే పానీపూరీ బండి నడపటం ఎందుకు లాభదాయకమో వివరించారు.

ముంబైలో అరుణ్‌ జోషీ అనే స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్‌ పానీపూరీతో పెద్ద వ్యాపారి అయిపోయాడు. కార్పొరేట్‌ ఉద్యోగులు పొద్దున్నే తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకూ పనిచేయాలి. పానీపూరీ వాళ్లు సాయంత్రం కాసేపు నడిపిస్తే చాలు. ఇందులో ఉన్న ఆదాయం అందులో లేనేలేదు. ఆ ఉద్యోగులు కస్టమర్ల చుట్టూ తిరగాలి. వాళ్లను ఆకట్టుకోవడానికి నానా తిప్పలూ పడాలి. ఇక్కడో.. కస్టమర్లే వీళ్లని వెతుక్కుంటూ వస్తారు. అక్కడ సెలవు కావాలంటే- పై అధికారుల్ని బతిమాలాలి, బామాడాలి, నానా కారణాలూ చెప్పాలి. ఇక్కడో ఎవర్నీ దేబిరించనవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు దర్జాగా సెలవు పెట్టొచ్చు, తనకు తానే రాజు. కొందరిలో ‘అమ్మో పానీపూరీ బండి పెడితే చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో’ అనే భయాలూ, సందేహాలూ ఉంటాయేమో! అవసరమే లేదు. సొంతంగా బండి పెట్టడానికి బెదురెందుకు? ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఇంత ఆదాయం ఆ ఉద్యోగాల్లో లేనేలేవని తెలుసుకుంటే అలాంటి బెంగలన్నీ మాయమైపోతాయి’ అంటూ తనదైన పంథాలో సరదాగా సెలవిచ్చారు. ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో వైరలై నవ్వుల పువ్వులు పూయిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని