క్యారెట్‌తో ఫ్లూట్‌

వేణువు.. వహ్వా అనిపించే వాయిద్యం కదూ! దీనికి మురళి, పిల్లనగ్రోవి, ఫ్లూట్‌.. అంటూ చాలానే పేర్లున్నాయి. తియ్యటి రాగాలు పలికించే వేణువును వెదురు కర్రతో చేయడమే మనందరికీ తెలుసు.

Published : 14 Apr 2024 00:01 IST

వేణువు.. వహ్వా అనిపించే వాయిద్యం కదూ! దీనికి మురళి, పిల్లనగ్రోవి, ఫ్లూట్‌.. అంటూ చాలానే పేర్లున్నాయి. తియ్యటి రాగాలు పలికించే వేణువును వెదురు కర్రతో చేయడమే మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎథాన్‌ టైలర్‌ స్మిత్‌ అనే డిజిటల్‌ క్రియేటర్‌ క్యారెట్‌తో ఫ్లూట్‌ తయారుచేశాడు. ‘ముసోరా అఫీషియల్‌’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో వైరలై వీక్షకులను మురిపిస్తోంది. క్యారెట్‌కు రంధ్రాలు చేసి, క్షణాల్లో మన కళ్ల ముందే మురళిగా మార్చడం అబ్బురపరిచేలా ఉంది. పోస్టయిన కొన్ని గంటలకే ఈ వీడియోకి 56 లక్షల వ్యూస్‌, దాదాపు నాలుగు లక్షల లైక్స్‌ వచ్చాయి. మీరూ ఓ లుక్కేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని