కుండ నీళ్లే శ్రేష్ఠం!

ఎండలు మండుతున్నాయి కదూ! ఈ వేడి నుంచి సేద తీరాలి, డీహైడ్రేషన్‌ బారిన పడకూడదంటే కుండనీళ్లు తాగాలి! ఎందుకంటారా..  

Published : 21 Apr 2024 00:20 IST

ఎండలు మండుతున్నాయి కదూ! ఈ వేడి నుంచి సేద తీరాలి, డీహైడ్రేషన్‌ బారిన పడకూడదంటే కుండనీళ్లు తాగాలి! ఎందుకంటారా..

  •  కుండ నీళ్లలో సహజసిద్ధంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం.. మొదలైనవి విడుదలై శరీరానికి మేలు చేస్తాయి.
  •  వేసవిలో వడదెబ్బ సాధారణ సమస్య.  మట్టి కుండలోని ఖనిజాలు వడదెబ్బను నిరోధిస్తాయి.
  • మనం తినే ఆహారం ఆమ్లంగా మారి శరీరంలో విషాన్ని సృష్టిస్తుంటుంది. ఆల్కలిన్‌ స్వభావం కలిగిన కుండ నీళ్లు దాన్ని నివారిస్తాయి.ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • ప్లాస్టిక్‌ బాటిళ్లలోని ఫ్రిజ్‌ నీళ్లు హాని చేస్తాయి. రసాయనాల్లేని కుండనీరే శ్రేష్ఠం. ఈ నీటితో నాలుక తడారిపోవడం, కడుపులో మంట, అజీర్ణం లాంటి సమస్యలు తలెత్తవు.
  • కుండ నీరు శరీరంలో సమతుల్యతకు దోహదం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. కుండలో నీళ్లు కొద్దికొద్దిగా ఆవిరవడం వల్ల చుట్టూ వాతావరణం కొంత చల్లబడుతుంది. కరెంట్‌ సాయంతో గాక.. సహజంగా చల్లబడే కుండనీరు దాహం తీర్చి, ఉపశమనం కలిగిస్తుంది. స్వచ్ఛంగా, తాజాగా ఉండే ఈ నీటికి ప్రత్యేక రుచి, వాసన తోడవుతాయి కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని