పిల్లలకు బిస్కెట్లు ఇస్తున్నారా!

టిఫిను, భోజనాల మధ్య ఖాళీలో వెంటనే గుర్తొచ్చేవి బిస్కెట్లు. ఇంటికెవరైనా వస్తే మొదటి మర్యాద వాటితోనే. బయటికెళ్లినప్పుడు ఆకలేస్తే గబుక్కున తినేదీ అవే.

Updated : 21 Apr 2024 00:51 IST

టిఫిను, భోజనాల మధ్య ఖాళీలో వెంటనే గుర్తొచ్చేవి బిస్కెట్లు. ఇంటికెవరైనా వస్తే మొదటి మర్యాద వాటితోనే. బయటికెళ్లినప్పుడు ఆకలేస్తే గబుక్కున తినేదీ అవే. ఇతర తినుబండారాలు ఏవున్నా లేకున్నా బిస్కెట్లు మాత్రం అందరిళ్లల్లో ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే రకరకాల బిస్కెట్లు మార్కెట్లో దొరుకుతుంటాయి. నిజానికి అవేం మంచివి కావని, హాని చేస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

  •  బిస్కెట్లలో పంచదార చాలా ఎక్కువుంటుంది. దాంతో దంతాలు పాడవడమే కాదు, చిన్నతనంలోనే మధుమేహం రావచ్చు.
  • బిస్కెట్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచు లాంటి పోషక విలువలు తక్కువ, కెలొరీలు ఎక్కువ. కనుక వీటికి దూరంగా ఉండాలి.
  •  బిస్కెట్లలో ఉపయోగించే కృత్రిమ రంగులు, వాసనలు, రిఫైండ్‌ పిండి.. ఇవన్నీ అనర్థమే. ఆహారం జీర్ణం కాకపోవడం దగ్గర్నుంచి చాలా సమస్యలు వస్తాయి.
  • బిస్కెట్లలో ఉండే పంచదార, లవణాలు, కొవ్వు లాంటివి మళ్లీ మళ్లీ తినాలనిపించే చాపల్యాన్ని పెంచుతాయి. అదొక అలవాటుగా మారుతుంది. దాంతో ఊబకాయం వస్తుంది.

బిస్కెట్ల వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలిశాక వాటికి దూరంగా ఉండటమే మంచిది కదూ! ముఖ్యంగా పిల్లలకు నచ్చజెప్పి మాన్పించండి. వాటి బదులు ఎంచక్కా తాజా పండ్లు ఇవ్వండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని