పుట్టినరోజున బొప్పాయి కటింగ్‌!

పుట్టిన రోజు, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో కేక్‌ కట్‌ చేయడం తెలిసిందే. అది చిన్నదా, పెద్దదా, పైనాపిలా, స్ట్రాబెర్రీనా.. అనేది వాళ్ల వాళ్ల అవసరాలూ, అభిరుచులను బట్టి ఉంటుంది.

Published : 21 Apr 2024 00:03 IST

పుట్టిన రోజు, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో కేక్‌ కట్‌ చేయడం తెలిసిందే. అది చిన్నదా, పెద్దదా, పైనాపిలా, స్ట్రాబెర్రీనా.. అనేది వాళ్ల వాళ్ల అవసరాలూ, అభిరుచులను బట్టి ఉంటుంది. అసలు కేక్‌ మాత్రమే ఎందుకు.. పండ్లు కోయకూడదా అనిపించిందో ఆలోచనాపరుడికి. ఇక తాత్సారం చేయలేదు. రంగురంగుల కాగితాలూ, బెలూన్లూ, కాగితాలూ..  ఇలా వాతావరణమంతా పుట్టినరోజు హంగామేనే ఉంది. పక్కనున్న కుటుంబసభ్యులు  బర్త్‌డే సాంగ్‌..పాడటం..  తేడా ఒక్కటే.. కేక్‌ బదులు తాపీగా బొప్పాయి పండును కట్‌ చేశాడు. విదేశీ సంప్రదాయానికి దేశీ హంగులు అద్దినట్లుంది కదూ! ఎవరిష్టం వాళ్లది. డాక్టర్‌ కవితా అజయ్‌ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుని.. నవ్వుల పూలు పూయిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని