పనీర్‌ మంచిదేనా..

చాలామందికి చాలా ఇష్టమైంది పనీర్‌. దీంతో చేసిన కూరలు, స్నాక్స్‌.. ఏవైనా మహత్తరంగా ఉంటాయి. పనీర్‌ రుచే కాదు, బలం కూడా. అయితే మార్కెట్లో దొరుకుతున్న పనీర్‌ మంచిదో కాదో తప్పకుండా తెలుసుకోవాలి.

Published : 28 Apr 2024 00:38 IST

చాలామందికి చాలా ఇష్టమైంది పనీర్‌. దీంతో చేసిన కూరలు, స్నాక్స్‌.. ఏవైనా మహత్తరంగా ఉంటాయి. పనీర్‌ రుచే కాదు, బలం కూడా. అయితే మార్కెట్లో దొరుకుతున్న పనీర్‌ మంచిదో కాదో తప్పకుండా తెలుసుకోవాలి. ఎలాగంటారా? అందుకు ఐదు మార్గాలున్నాయి.

  • అసలు పనీర్‌ను చూడగానే అర్థమైపోతుంది.. అది మంచిదో కాదో. తాజా పనీర్‌ తెల్లగా లేదా క్రీమ్‌ రంగులో ఉంటుంది. ముదురు పసుపు రంగులో ఉన్నా.. లేదా మొత్తం ఒకే రంగులో కాకుండా.. కొంత ఒక రంగులో, మరికొంత ఇంకో రంగులో ఉన్నా.. అది స్వచ్ఛమైంది కాదని గ్రహించాలి.
  • ఓ చిన్న ముక్కను నలిపి చూస్తే కొద్దిగా మెత్తగా తగులుతుంది. నాణ్యమైంది మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండదు.
  • వాసన చూస్తే తెలిసీ తెలియనట్టుగా కొద్దిగా పాల మిఠాయి వాసన వస్తుంది. అలా కాకుండా గాఢమైన లేదా పుల్లటి వాసన వచ్చిందంటే స్వచ్ఛంగా లేదన్నమాట.
  • పనీర్‌ ముక్కను నీళ్ల గ్లాసులో వేస్తే.. మంచిదైతే మునిగిపోయి, అడుగున చెక్కుచెదరకుండా ఉంటుంది. కల్తీది కరిగిపోతుంది లేదా విరిగిపోతుంది.
  • పనీర్‌ను నూనె లేకుండా పెనం మీద వేడి చేయండి. మంచిదైతే ఆకారం మారదు, కొద్దిగా తేమ బయటికొస్తుంది. అదే కల్తీ పనీర్‌ అయితే కరిగిపోతుంది లేదా అందులోంచి చాలా నీరు వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు