ఆరు రకాలు ఒకే చెట్టుకు!

జామచెట్టుకు జామ, సపోటా చెట్టుకు సపోటాలే కాస్తాయి. చెట్టొకటి అయితే పండు ఇంకొకటి రాదు. కానీ.. ఒక చెట్టుకు ఆరు రకాల పండ్లు వస్తే? ఇదేం ఫాంటసీ సినిమానా అనుకుంటున్నారా?

Published : 05 May 2024 00:23 IST

జామచెట్టుకు జామ, సపోటా చెట్టుకు సపోటాలే కాస్తాయి. చెట్టొకటి అయితే పండు ఇంకొకటి రాదు. కానీ.. ఒక చెట్టుకు ఆరు రకాల పండ్లు వస్తే? ఇదేం ఫాంటసీ సినిమానా అనుకుంటున్నారా? అలాంటివి నిజం చేసి చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాలో ఎక్కువ అంట్లు కట్టడం (మల్టీ గ్రాఫ్టెడ్‌) అనే పద్ధతిలో ఒక చెట్టుకు ఆరు రకాల పండ్లు వచ్చేలా అభివృద్ధి చేశారు. వీటిని ‘ఫ్రూట్‌ సలాడ్‌ ట్రీస్‌’ అంటారు. గమ్మత్తేమిటంటే ఒకే చెట్టుకు కాసినప్పటికీ ఆయా పండ్లు.. రంగు, రూపం, రుచి, వాసన.. ఎందులోనూ సహజత్వాన్ని కోల్పోవు. వీటిని నేల మీదే కాదు, కుండీల్లోనూ పెంచవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని