వయసును తగ్గిస్తుంది..

తేలిగ్గా జీర్ణమై, గొప్ప పోషకాలను అందించేవాటిలో పిస్తా ముందుంటుంది. ఇందులో ఎ, బి3, బి5, బి6, సి, ఇ- విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాట్‌, పీచు, చక్కెర, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌, భాస్వరం, ఫొలేట్‌, ఐరన్‌, జింక్‌, కాల్షియంలు ఉన్నాయి.

Updated : 05 May 2024 10:36 IST

తేలిగ్గా జీర్ణమై, గొప్ప పోషకాలను అందించేవాటిలో పిస్తా ముందుంటుంది. ఇందులో ఎ, బి3, బి5, బి6, సి, ఇ- విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాట్‌, పీచు, చక్కెర, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌, భాస్వరం, ఫొలేట్‌, ఐరన్‌, జింక్‌, కాల్షియంలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. కంటిచూపు మెరుగవుతుంది. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయం రాదు. పిస్తాపప్పులు వృద్ధాప్యంలో వచ్చే అనేక సమస్యలను నివారిస్తాయి. రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి. న్యూరోడీజెనరేటివ్‌ సమస్యను, కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే కెరొటినాయిడ్స్‌ వీటిలో విస్తారంగా ఉన్నాయి. అలాగే ఈ పప్పుల్లో యాంటీఆక్సిడెంట్‌, యాంటీవైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్‌ గుణాలు ఉన్నాయి. పిస్తాలోని ఎమినో యాసిడ్స్‌ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచితే.. కె-విటమిన్‌ వయసును కనిపించనివ్వదు.  

వేయించి, ఉప్పు చల్లిన పిస్తా పప్పులు ఎక్కువ రుచిగా ఉండే మాట నిజమే కానీ పచ్చివి మరింత శ్రేష్ఠం. ఐస్‌క్రీమ్‌, పుడ్డింగ్‌, స్వీట్లు, కుకీస్‌.. వంటి వాటికి పిస్తాపప్పులు అదనపు రుచిని తెస్తాయి. ‘పిస్తా తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, రోజంతా ఉత్సాహంగా ఉండేట్లు చేస్తుంది’ అన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ గుప్తా. ఇవి మేలు చేసేవే అయినప్పటికీ వాతంతో బాధపడే వారు, మూత్రపిండాల సమస్య ఉన్నవారు చాలా తక్కువ తినాలి. నట్‌ ఎలర్జీ ఉన్నవాళ్లు వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని