ఇక సులువుగా చేసేయొచ్చు!

కజ్జికాయలు పేరు ఒకటే కానీ.. అందులో స్టఫింగ్‌ను బట్టి.. రకరకాల రుచులను ఆస్వాదిస్తాం. వీటి కోసం ఒక అచ్చు ఉండటం తెలిసిందే. సాంకేతికత పెరిగాక.. వేగంగా, తేలిగ్గా చేసే డంప్లింగ్‌ మేకర్‌లను రూపొందిస్తున్నారు

Published : 12 May 2024 00:23 IST

కజ్జికాయలు పేరు ఒకటే కానీ.. అందులో స్టఫింగ్‌ను బట్టి.. రకరకాల రుచులను ఆస్వాదిస్తాం. వీటి కోసం ఒక అచ్చు ఉండటం తెలిసిందే. సాంకేతికత పెరిగాక.. వేగంగా, తేలిగ్గా చేసే డంప్లింగ్‌ మేకర్‌లను రూపొందిస్తున్నారు. మనకు అనుకూలంగా అనిపించేది కొనుక్కుంటే సరిపోతుంది. ఇవి ప్లాస్టిక్‌తో తయారైనందున తుప్పు పట్టవు. ఈ పరికరం ఉంటే పని సులువైపోతుంది. ఇందులో చిన్న రొట్టెను, దాని మధ్యలో స్టఫింగ్‌ను ఉంచితే.. చక్కటి ఆకృతిలో కజ్జికాయ సిద్ధమవుతుంది. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో వేయించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని