ఇక ఎండబెట్టడం ఎంత తేలికో!

చారులో నంజుకోవడానికి వడియాలుంటే ఎంత బాగుంటుంది కదూ! కానీ వాటిని ఎండబెట్టడం పెద్ద ప్రహసనమే. దుమ్మూధూళీ పడుతుంది, కాకులు, పిల్లులు వంటి జీవాలు వస్తాయనే బెంగ ఉంటుంది.

Published : 26 May 2024 00:36 IST

చారులో నంజుకోవడానికి వడియాలుంటే ఎంత బాగుంటుంది కదూ! కానీ వాటిని ఎండబెట్టడం పెద్ద ప్రహసనమే. దుమ్మూధూళీ పడుతుంది, కాకులు, పిల్లులు వంటి జీవాలు వస్తాయనే బెంగ ఉంటుంది. ఇక అలాంటి భయాలేమీ అవసరం లేదు. ‘నైలాన్‌ నెట్టింగ్‌ ఫోల్డర్‌’ కొనుక్కుని.. ఎండ తగిలే చోట కొక్కేనికి తగిలించేయొచ్చు. వీటిలో 3 నుంచి 5 వరకూ అరలుంటాయి. వడియాలు, చల్ల మిరప కాయలు, ఎండు మిరపకాయలు, మాగాయ పచ్చడికి ముక్కలు, పొడి చేసుకునేందుకు కూరగాయలు.. ఇలా వేటినైనా భేషుగ్గా ఎండబెట్టు కోవచ్చు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్స్‌లో ఎండబెట్టేంత చోటు లేనివారికి ఇది మరింత ఉపయోగపడుతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని