ఉల్లి తేలిగ్గా తరగొచ్చు..

ఉల్లిపాయ లేకుంటే ఒక్కరోజు గడవదు. కానీ ఉల్లిముక్కలను వేగంగా కోయాలంటే.. కొంచెం బెసికిపోతుంటుంది కదూ! అలా కదలకుండా ఉండేందుకు రూపొందించిందే ‘ఆనియన్‌ కటర్‌ హోల్డర్‌’.

Published : 09 Jun 2024 00:41 IST

ఉల్లిపాయ లేకుంటే ఒక్కరోజు గడవదు. కానీ ఉల్లిముక్కలను వేగంగా కోయాలంటే.. కొంచెం బెసికిపోతుంటుంది కదూ! అలా కదలకుండా ఉండేందుకు రూపొందించిందే ‘ఆనియన్‌ కటర్‌ హోల్డర్‌’. కింద సూదులు, పైన హ్యాండిల్‌ ఉన్న ఈ చిన్ని సాధనాన్ని ఉల్లిపాయకు మధ్యలో గుచ్చితే.. స్థిరంగా ఉంటుంది. అప్పుడిక ముక్కలు చకచకా తరగొచ్చు.

స్ట్రాస్పూన్‌ కావాలా..

కొబ్బరిబొండం, కూల్‌డ్రింక్‌ ఏది తాగాలన్నా స్ట్రా కావాల్సిందే. ప్లాస్టిక్‌తో తయారైన ఇవన్నీ పర్యావరణాన్ని పాడుచేసేవే. మరి స్ట్రా లేకుండా ఎలా తాగాలంటారా? స్టీల్‌ స్ట్రా కొనుక్కుంటే సరిపోతుంది. ఎంచక్కా కడిగి, మళ్లీ వాడుకోవచ్చు. ఇప్పుడు మరింత ఉపయోగపడేలా ‘స్ట్రా కమ్‌ స్పూన్‌’ కూడా వచ్చేసింది. ఇది పండ్లరసానికీ పనికొస్తుంది. అందులో పంచదార, నిమ్మరసం లాంటివి కలిపి మరీ తాగొచ్చు. ఇది చూసేందుకు ఆకట్టుకునేలానూ ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని