dehydration: వేసవి తాపానికి చెక్‌ పెట్టేద్దాం

ఏప్రిల్‌ నెల ఇంకా మొదలవకుండానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో చూడండి..

Updated : 31 Mar 2024 16:43 IST

ఏప్రిల్‌ నెల ఇంకా మొదలవకుండానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో చూడండి..

  • మనం ఎప్పుడూ వినే మాట.. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలనేది. కానీ తాజాగా నెబ్రాస్కా-లింకన్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని బట్టి ఆ లెక్క అందరికీ ఒకలా కాకుండా మనిషి మనిషికీ మారుతుంది. వాళ్ల ఆరోగ్యస్థితి, చేసే పనులు, వాళ్లున్న వాతావరణం లాంటి అనేక అంశాలను బట్టి శరీరానికి నీళ్లు అవసరమవుతాయి. తమకు ఎంత కావాలనిపిస్తే అంతే తాగాలి.
  • తగినన్ని నీళ్లు తాగకపోయినా, అతిగా తాగినా కూడా ప్రమాదమేనంటున్నారు గురుగ్రాం నారాయణ ఆసుపత్రిలో డైటీషియన్‌ పరమీత్‌ కౌర్‌. శరీరంలో నీళ్లు ఎక్కువైతే అది కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుందని తేల్చారామె.
  •  దాహం మరీ ఎక్కువయ్యేదాకా నీళ్లు తాగకుంటే.. చాలా ఎక్కువ నీళ్లు తాగాల్సివస్తుంది. అది కడుపుబ్బరం, తలనొప్పి, మైకం లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
  •  ఎండలో వెళ్లేట్లయితే నీళ్లు ఎక్కువ తాగాలి. లేకుంటే చెమట రూపంలో నీరు వెళ్లిపోయి డీహైడ్రేషన్‌ ఏర్పడే ప్రమాదం ఉంది.
  •  ఎండగా ఉన్నప్పుడు కూల్‌డ్రింక్స్‌, సోడా, ఐస్‌, ఎసెన్స్‌ కలిపిన పండ్లరసాలు, కోల్డ్‌ కాఫీ లాంటి పానీయాలు తాగాలనిపిస్తుంది. నిజానికి ఇవన్నీ హాని చేసేవే. కనుక వాటికి బదులు నీళ్లు తాగడమే మంచిది.
  • మనం చాలాసార్లు నిలబడి నీళ్లు తాగుతాం. దీనివల్ల రక్తం పల్చబడుతుంది, వాపు లాంటి సమస్యలు వస్తాయి- అంటున్నారు హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ కోచ్‌ లూక్‌ కౌంటినో. అందువల్ల ఇక నుంచి కూర్చుని నీళ్లు తాగండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని