కాఫీ, టీ ఎప్పుడు, ఎంతవరకూ తాగాలంటే..

కాఫీ, టీ మంచిది కాదనే మాట అనేకసార్లు వింటుంటాం కదూ! అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) తాజాగా విడుదల చేసిన ఆరోగ్యసూత్రాలు ఇలా ఉన్నాయి

Updated : 19 May 2024 05:05 IST

కాఫీ, టీ మంచిది కాదనే మాట అనేకసార్లు వింటుంటాం కదూ! అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) తాజాగా విడుదల చేసిన ఆరోగ్యసూత్రాలు ఇలా ఉన్నాయి- 

  • చాయ్‌ కానీ కాఫీ కానీ అసలే మానేయమనడం లేదు. కాకపోతే భోజన సమయంలో మంచిది కాదు. గంట ముందు లేదా తర్వాత తాగండి. కొందరు ఆహారం తీసుకునేటప్పుడు కాఫీ, టీలు తాగితే త్వరగా అరుగుతుందని, శరీరంలో పేరుకున్న నూనెను కరిగించేస్తుందని అనుకుంటారు. అది నిజం కాదు.
  • అయితే కాఫీలో ఉండే టన్నిన్స్‌ ఐరన్స్‌ గ్రహించడంలో తోడ్పడుతుంది. కనుక ఐరన్‌ లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఎనీమియా రాదు. అయితే కాఫీ, టీల్లో కెఫిన్‌ ఉంటుంది కనుక అది మోతాదు మించిన కొద్దీ మానసిక రుగ్మతలతో సహా అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
  • పరగడుపున కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అది మంచిది కాదు, ఏమైనా తిన్న తర్వాతే తాగాలి.
  • కాఫీ, టీల్లో ఉండే థియోఫిలిన్‌ రక్త సరఫరా సక్రమంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల గుండె జబ్బులు, జీర్ణాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే పాలు లేకుండా డికాక్షన్‌ తాగడం మంచిది. 
  • తక్కువ మోతాదులో కాఫీ, టీ తీసుకుంటే ఫరవాలేదు. అంతకంటే ముఖ్యంగా.. తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, మాంసం, చేపలు, రొయ్యలు లాంటి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు