పచ్చసొనను విడగొట్టేస్తుంది!

పొద్దున్నే బ్రెడ్‌ టోస్ట్, ఆనక ఆమ్లెట్, ఆపైన పొరటు.. ఇలా ఏది చేయాలన్నా గుడ్లే కదా కావాలి. కానీ కేక్స్‌ లాంటి వాటిల్లో తెల్ల సొన వరకే అవసరం.

Updated : 19 May 2024 05:07 IST

పొద్దున్నే బ్రెడ్‌ టోస్ట్, ఆనక ఆమ్లెట్, ఆపైన పొరటు.. ఇలా ఏది చేయాలన్నా గుడ్లే కదా కావాలి. కానీ కేక్స్‌ లాంటి వాటిల్లో తెల్ల సొన వరకే అవసరం. అలాంటప్పుడు పచ్చసొనను చితకకుండా వేరుచేయడం కొంచెం కష్టమైన వ్యవహారమే. ఆ శ్రమను తగ్గించడానికే ‘యోక్‌ సెపరేటర్‌’ వచ్చింది. రెండు అరల టిఫిన్‌ డబ్బాలా ఉంటుందీ పరికరం. పై డబ్బా మధ్యలో క్రాకర్‌ టూల్‌ ఉంది. కొనదేలి ఉన్న దాని మీద గుడ్డు పగలగొడితే చాలు తెల్ల సొన కిందికి జారి, యోక్‌ మిగులుతుంది. ఇలా ఒక్కోసారి ఐదింటిని విడగొటË్టవచ్చు. గుడ్లు ఉపయోగించే ప్రతి ఇంట్లో ఉండాల్సిన సాధనం ఇది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని