లలితాసహస్ర నామాలను ఎవరు రచించారు?
జగజ్జనని ఆది పరాశక్తి సృష్టే సకల విశ్వం. విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు అమ్మవారి వేయి నామాలను అగస్త్యమహర్షికి బోధించారు. సకల చరాచర జగత్తును పాలించే అమ్మవారి సహస్ర నామాలను పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. సాక్షాత్తు తల్లి పార్వతీదేవి మనకు ఇచ్చిన గొప్పవరం ఈ నామావళి. ...
లలితాసహస్ర నామాలను ఎవరు రచించారు?
ఈ శ్లోకాల విశిష్టత ఏమిటి?
జగజ్జనని ఆది పరాశక్తి సృష్టే సకల విశ్వం. విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు అమ్మవారి వేయి నామాలను అగస్త్యమహర్షికి బోధించారు. సకల చరాచర జగత్తును పాలించే అమ్మవారి సహస్ర నామాలను పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. సాక్షాత్తు తల్లి పార్వతీదేవి మనకు ఇచ్చిన గొప్పవరం ఈ నామావళి. అమ్మవారి యశస్సుని కీర్తిని, శక్తిని తెలిపే నామాలను పఠిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతి మనిషి జీవితంలో అనేక మైన జాతక దోషాలుంటాయి. వీటి నివారణకు మనం ఎన్నో శాంతి ప్రక్రియలు చేస్తుంటాం. అయితే అమ్మవారి లలితా నామాలను చదివితే ఈ జాతకదోషాలు మనలను బాధించవు. బ్రహ్మాండపురాణంలో లలితా దేవి సహస్ర నామావళి వుంది. పరమపవిత్రమైన శ్రీపురం అమ్మవారి నివాసస్థలాన్ని సూచించే శ్రీచక్ర ప్రస్తావన పురాణాల్లో వుంది. అమ్మవారి స్థానం కనుక శ్రీచక్రానికి అంత విశిష్టత లభించింది. భండాసురున్ని సంహరించేందుకు జగన్మాత లలితా దేవిగా జన్మించినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. నియమబద్ధంగా, శుచిగా అమ్మవారి నామాలను పఠిస్తే అనంతమైన ఆనందం కలుగుతుంది. ఈ మంత్రాలను వాశిన్యాది దేవతలు అమ్మ ఆనతి ప్రకారం మొదట పఠించారు. అనంతరం హయగ్రీవులు అగస్త్యమహర్షికి ఉపదేశించారు. ఆదిశంకరాచార్యులు, భాస్కరాచార్యులు సహస్రనామాలపై వ్యాఖ్యానాలు చేశారు. సమస్త జగత్తును నడిపించే ఆ తల్లి నామావాళిని ఏకాగ్రతతో చదివితే మనకు అంతా మంచే జరుగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్‌కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్