Sonam Kapoor: ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్‌ కపూర్

బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ తెలిపారు.

Published : 27 Apr 2024 11:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్ (Sonam Kapoor) ప్రసవానంతరం తనకెదురైన అనుభవాల్ని, బరువు పెరిగిన సంగతిని గుర్తుచేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బరువు పెరగడంతో బాధపడినట్లు తెలిపారు.

‘గర్భం దాల్చిన తరువాత 32 కిలోల బరువు పెరిగాను. ప్రసవానంతరం కూడా అలానే ఉన్నాను. దీంతో కొంచెం బాధపడ్డా. బిడ్డను చూసుకోవడంలో మునిగిపోయి బరువు తగ్గడం గురించి ఆలోచించలేదు. సరైన ఆహారం గురించి కూడా పట్టించుకోలేదు. ఏడాదిన్నర తర్వాత శరీరాకృతిపై దృష్టిపెట్టాను. ఇప్పటి వరకు 20 కిలోలు తగ్గాను ఇంకా 6 తగ్గాలి. తల్లైన తర్వాత ప్రతిదీ మారుతుంది. కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. కుటుంబంతో ఉండే సంబంధాల్లో కూడా మార్పు వస్తుంది. మనల్ని మనం మర్చిపోయి బిడ్డలే లోకంగా బతుకుతాం. శరీరంపై పెద్ద ధ్యాస ఉండదు. ఈ అనుభూతి చాలా అపురూపంగా ఉంది. స్త్రీగా పుట్టడం అద్భుతమైన విషయం. బరువు తగ్గడం కోసం నేనేం ప్రత్యేకంగా వర్కవుట్‌లు చేయలేదు. ఆహారం విషయంలో మార్పులు చేసి నెమ్మదిగా తగ్గానంతే’ అని చెప్పారు.

‘సావరియా’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన సోనమ్‌ కపూర్‌ వరుస ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘దిల్లీ-6’, ‘బాంబే టాకీస్‌’, ‘ప్రేమ రతన్‌ ధన్‌ పాయో’, ‘నీర్జా’, ‘సంజు’ చిత్రాలు సోనమ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటిగా రాణిస్తున్న సమయంలోనే వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఈ జంట 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.  2022లో మగబిడ్డకు జన్మనిచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని