Archery World Cup 2024: ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో అదరగొట్టిన భారత్‌.. మూడు స్వర్ణాలు కైవసం

భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది.

Published : 27 Apr 2024 13:21 IST

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 (Archery World Cup 2024) టోర్నీలో భారత ఆర్చర్లు అదరగొట్టేశారు.  తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్, మహిళా జట్టు స్వర్ణాలు నెగ్గడంలో సురేఖ కీలక పాత్ర పోషించింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురేఖ- అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్‌లో  158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై విజయం సాధించింది. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమేశ్‌తో కూడిన భారత జట్టు నెదర్లాండ్‌కు చెందిన మైక్‌ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్‌ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో అలవోకగా స్వర్ణం సాధించింది. 

మహిళల జట్టు విభాగంలో ఇటలీకి చెందిన టీమ్‌పై భారత్‌ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్‌లో స్వర్ణం గెలిచారు. వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన టీమ్‌ఇండియా 236-225 తేడాతో ఇటలీ ఆర్చర్లు మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్‌పై ఘన విజయం సాధించడం విశేషం. ఇటలీ ప్లేయర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో అంకిత బాకత్‌- బొమ్మదేవర ధీరజ్‌ జోడీ మెక్సికతో తలపడనుంది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు