జయజయ శంకర.. హరహర శంకర..

ధర్మదండం ధరించి వాదన పటిమతో గెలిచి భరతఖండం నలుమూలల తిరిగి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు శ్రీ శంకర భగవత్పాదులు. 32 ఏళ్లే జీవించినా ఆసేతు హిమాచలాన్ని ..

Published : 10 May 2016 22:08 IST

జయజయ శంకర.. హరహర శంకర..

ధర్మదండం ధరించి వాదన పటిమతో గెలిచి భరతఖండం నలుమూలల తిరిగి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు శ్రీ శంకర భగవత్పాదులు. 32 ఏళ్లే జీవించినా ఆసేతు హిమాచలాన్ని కాలినడకపైన చుట్టివచ్చిన మహానుభావుడు ఆదిశంకరుడు. కేరళలోని కాలడిలో జన్మించిన శంకరులు ఐదేళ్ల వయస్సులోనే దారిద్య్రంతో కటకటలాడుతున్న వృద్ధ బ్రాహ్మణికి కనకధారస్తోత్రం ద్వారా మహాలక్ష్మీ అనుగ్రహాన్ని ఇప్పించిన వితరణశీలి . తల్లి నీటి కోసం కష్టపడుతుంటే పూర్ణనదిని తన శక్తితో దారి మళ్లించి తల్లి కష్టం తీర్చారు. ఎనిమిదేళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించి భారతదేశ యాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో దాదాపు 72 శాఖలుగా హైందవ మతం వుండేది. శాక్తేయులు, కాపాలికులు, సూర్యున్ని ఆరాధించేవారు, గణపతిని ఆరాధించేవారు... ఇలా తమ శాఖే గొప్పదని వాదించేవారు. అయితే శంకరులు వారితో సముచితమైన వాదన చేసి మెప్పించి అందరిని సనాతన ధర్మం వైపు మళ్లించారు. కశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఎన్నెన్నో దేవాలయాలకు కట్టుబాట్లు ఏర్పరచారు. బ్రహ్మసూత్రం, వేదాలు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు. భజగోవిందంలో మానవజీవిత పరమార్థాన్ని వివరించారు. హైందవమత పరిరక్షణకు బదరినాథ్‌, పూరి, ద్వారకా, శృంగేరి పీఠాలను నెలకొల్పారు. ఇప్పటికీ ఈ పీఠాలు సనాతనధర్మ పరిరక్షణకు కృషిచేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని