నయాట్రెండ్స్‌ గురూ! నచ్చడం షురూ!!

ఎంత ఫిట్నెస్ జంకీకైనా ఎప్పుడూ ఒకే రకం వ్యాయామం చేయాలంటే బోర్. వర్కవుట్లు మారుతూ ఉంటే...

Published : 19 Jan 2016 12:14 IST

నయాట్రెండ్స్‌ గురూ! నచ్చడం షురూ!!



ఎంత ఫిట్‌నెస్‌ జంకీకైనా ఎప్పుడూ ఒకే రకం వ్యాయామం చేయాలంటే బోర్‌. వర్కవుట్లు మారుతూ ఉంటే చేయాలనే ఉత్సాహం జోరందుకుంటుంది. అందుకే గురూ ఆముదాలవలస నుంచి అమెరికా దాకా ఈమధ్య పాపులర్‌ అయిన కొన్ని ట్రెండ్స్‌ పరిచయం చేస్తున్నాం. నిపుణుల సలహాలతో రెచ్చిపోండిక. 

 

రియల్‌ సిల్క్‌/ఏరియల్‌ వర్కవుట్‌: ఓ పొడుగాటి గుడ్డని తాడులా చేసేసి ఒక కొసని సీలింగ్‌కి కట్టేసి, మరో చివర ఆసరాతో రకరకాల విన్యాసాలు చేసేయడమే. ధూమ్‌ 3 మలంగ్‌ పాటలో కత్రినా కైఫ్‌ ఏం చేసిందో గుర్తుందిగా? అచ్చంగా అలాంటిదే ఈ వర్కవుట్‌.

బాటిల్‌ రోప్స్‌: ‘మేరీకోమ్‌’లో ప్రియాంకా చోప్రా చేసిన వర్కవుట్‌. బరువైన తాడు ఒక చివర పట్టుకొని రెండో కొస కదిలేలా కిందికీ, పైకీ వూపడం. మొత్తం శరీరానికి చక్కని వ్యాయామం. అధిక కేలరీలు కరిగి టోన్డ్‌ బాడీ తయారవుతుంది.

  టీఆర్‌ఎక్స్‌: నావికాదళం అధికారుల శిక్షణనిచ్చే వర్కవుట్‌ సామాన్య యూత్‌నీ పలకరిస్తోంది. రెసిస్టెంట్‌ బ్యాండ్‌ సాయంతో మొత్తం శరీరాన్ని కిందికీ పైకీ వంచుతూ చేసే వర్కవుట్‌. శరీరం పైభాగం, చేతులు, కాళ్లు, తొడ భాగాలు గట్టిపడతాయి.

ఫిట్‌నెస్‌ లాడర్‌: నిచ్చెనంటే అందరికీ తెలుసు. దాన్నే నేలపై పడుకోబెట్టి వాటి మధ్యల్లోంచి ఎగురుతూ, దూకుతూ, 

ముందుకూవెనక్కీ ఎలాగైనా గెంతులేయొచ్చు. కండరాలు, పిక్కలకు బలం. బోసు (BOSU) జిమ్‌ బంతిపై నిల్చోలేం, కూర్చోలేం. దాన్నే సర్కిల్‌ చేస్తే? ప్రయత్నిస్తే ఎలాంటి ఆసనాలైనా వేయొచ్చు. దీంతో బాడీ బ్యాలెన్సింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

  పార్ట్‌నర్‌ వర్కవుట్‌: ఆడుతుపాడుతు పనిచేస్తుంటే పనిలోనే కాదు.. జిమ్‌లోనూ రకరకాల వర్కవుట్‌ తేలిగ్గా చేసేయొచ్చు. అందుకే జంటగా ప్రయత్నించే ఆక్రోయోగా, ట్యాంగో యోగా, థాయ్‌ చీ, జెన్‌.. ఇలాంటి ఆసనాలను పార్ట్‌నర్‌ వర్కవుట్లు అ†టున్నారు.  


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని