సైటుకో మనస్తత్వం

ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌.. వాట్సాప్‌ మనకి చాలా సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉంటుంది....

Published : 22 Apr 2017 01:32 IST

సైటుకో మనస్తత్వం

ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌.. వాట్సాప్‌ మనకి చాలా సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉంటుంది. ఖాతాలెన్నైనా మనం అన్నిచోట్లా ఒకటేగా! ఇదే మాటంటే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు అస్సలు ఒప్పుకోరు. వ్యక్తి ఒక్కడైనా సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌ సైట్‌కీ ఒక్కోరకమైన మనస్తత్వం చూపిస్తారట. అంటే ఒక్కోదాంట్లో ఒక్కో రకమైన అపరిచితుడు బయటికి వస్తాడన్నమాట. తేలిగ్గా చెప్పాలంటే ఫేస్‌బుక్‌లో మనం మన గురించి యూత్‌ఫుల్‌గా, రొమాంటిగ్గా చెప్పుకుంటే.. లింక్డ్‌ఇన్‌లో హుందాగా, పెద్ద ఆఫీసర్‌లా పోజు కొడతారట. కామెంట్లు, పోస్ట్‌లు సైతం ఖాతాఖాతాకి రకరకాలుగా మారిపోతుంటాయి. ఇదేదో ఆషామాషీగా చెప్పిన మాట కాదు. లక్షమంది నెటిజన్లకు చెందిన రకరకాల సామాజిక మాధ్యమ ఖాతాల్ని పరిశీలించి, పరిశోధించి మరీ ఈ కొత్త సంగతి బయటపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని