Published : 24 Jun 2017 02:05 IST

ఆడేస్తోంది యంగిస్థాన్‌

ఆడేస్తోంది యంగిస్థాన్‌

యూత్‌ అన్నాక వారి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉండటం ఈరోజుల్లో సాధారణం. దాంతో ఏం చేస్తారు? ఫోన్లు.. చాటింగ్‌.. అంతేగా. అంతేకాదండోయ్‌.. గేమ్స్‌ కూడా ఆడేస్తారు. ఎంతలా అంటే రోజులో సగటున యాభై ఎనిమిది నిమిషాలపాటు. మన యంగిస్థాన్‌ల గురించే ఇదంతా. ప్రముఖ మొబైల్‌ గేమింగ్‌ సంస్థ చేసిన అధ్యయనంలో తేలిన సంగతి ఇది. ఆ సర్వేలోని మరిన్ని విషయాలు.

35 నగరాలు, 10,050 మంది జనం - అధ్యయనం కోసం ఎంచుకున్నవారు

15 కోట్లు - సెల్‌ఫోన్లో గేమ్స్‌ ఆడేవారి మొత్తం సంఖ్య

22 శాతం - మొత్తం గేమర్లలో అమ్మాయిల శాతం

12 శాతం - రోజుకి రెండు గంటలపైనే ఆట కోసం సమయం కేటాయిస్తున్నవారు

53 శాతం - ఆర్కేడ్‌, యాక్షన్‌, రేసింగ్‌ ఆటల్ని ఆడుతున్నవారు

71 శాతం - రోజుకి ఒక్కసారైనా గేమ్‌ ఆడేవారు

23 శాతం - పజిల్‌ లాంటి గేమ్స్‌ని ఇష్టపడేవారు

29.5 మిలియన్లు - గత ఆర్నెళ్లలో అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లు

ఆధారం: మౌజ్‌ మొబైల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు