లేస్‌లెస్‌ రన్నింగ్‌ షూ

రన్నింగ్‌ షూ అంటే లేస్‌ లేకుండా ఎలా? పరిగెడుతుంటే ­డిపోవు? అనేనా మీ అనుమానాలు....

Published : 13 Jan 2018 02:24 IST

కొత్తగా...
లేస్‌లెస్‌ రన్నింగ్‌ షూ

న్నింగ్‌ షూ అంటే లేస్‌ లేకుండా ఎలా? పరిగెడుతుంటే ­డిపోవు? అనేనా మీ అనుమానాలు.... వాటికి సమాధానంగా వచ్చినవే ఈ అడిడాస్‌ అల్ట్రాబూస్ట్‌ లేస్‌లెస్‌ షూ. రన్నింగ్‌లో షూ లేస్‌ కొంచెం బిగుతుగా కట్టుకున్నా కష్టమే. వదులైనా ఇబ్బందే. ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి అడిడాస్‌ మొట్టమొదటి సారి లేస్‌లెస్‌ షూని మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రత్యేకమైన, అభివృద్ధి చేసిన ఓవెన్‌ప్రైమ్‌నిట్‌ మెటీరియల్‌ పాదంపైన కావాల్సినంతగా పట్టి ఉంచుతుంది. పైగా పాదం కదలడానికి వీలుగా దీన్ని డిజైన్‌ చేశారు. దీనివల్ల షూ బరువు చాలా తక్కువగా ఉంటుంది. పరిగెత్తేటప్పుడు పాదం కింది భాగంలోనూ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఫోంను అమర్చారు. దీనివల్ల పాదం త్వరగా అలసిపోకుండా ఉంటుంది. ఇక గ్రిప్‌ తయారీలోనూ ప్రత్యేక రబ్బరు వాడి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రన్నింగ్‌ షూ కొనే ఆలోచనలో ఉంటే ఈసారి వీటిని ట్రైచేయండి. మీకు కొత్త అనుభూతిని పంచుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని