Mrunal Thakur: ‘ఫ్రీజింగ్‌ ఎగ్స్‌’ విధానం మంచిదే: మృణాల్‌ ఠాకూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఫ్రీజింగ్‌ ఎగ్స్‌’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) చెప్పారు.

Published : 26 Apr 2024 11:34 IST

ముంబయి: వెండితెర, ఓటీటీ వేదికగా వరుస ప్రాజెక్టులతో వినోదాన్ని అందిస్తున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. వివాహం, పిల్లలు కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘వర్క్‌, పర్సనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎంతో అవసరం. దానిని ఎలా సాధించాలని ఆలోచిస్తుంటాం. రిలేషన్‌షిప్స్‌ ఎంతో కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. అందుకే, మన వృత్తిని అర్థం చేసుకునే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎంతో అవసరం. వర్క్‌ లైఫ్‌ నుంచి నన్ను బయటకు తీసుకువచ్చేది నా స్నేహితులు, సోదరి. వాళ్లు అన్నివిధాలుగా నాకు సపోర్ట్‌గా నిలుస్తుంటారు’’ అని ఆమె చెప్పారు. అనంతరం ‘ఫ్రీజింగ్‌  ఎగ్స్‌’ విధానంపై మాట్లాడుతూ.. ఆ పద్ధతికి తాను సుముఖంగానే ఉన్నానని, భవిష్యత్తులో అవసరమైతే దీని గురించి ఆలోచిస్తానని చెప్పారు. కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలు.. వయసులో ఉన్నప్పుడే తమ అండాలను శీతలీకరించుకుని.. ఆ తర్వాత నచ్చినప్పుడు పిల్లలు కంటారు. దీనినే ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ అంటారు. ఈ పద్ధతిలోనే నటి ప్రియాంకా చోప్రా ఓ పాపకు తల్లయ్యారు.

సినిమాల విషయానికి వస్తే.. ‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ తర్వాత మృణాల్‌ నటించిన తెలుగు చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఇందుగా కనిపించారు. పరశురామ్‌ దర్శకుడు. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ‘పూజా మెరీ జాన్‌’లో నటిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని