48.92 లక్షల మంది ఖాతాల్లో జమకానున్న పింఛను

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో 48.92 లక్షల మంది (74%) బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్టు గుర్తించామని.. వీరందరికీ పింఛను మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వెల్లడించారు.

Published : 29 Apr 2024 05:13 IST

మరో 16.57 లక్షల మందికి ఇళ్ల వద్దనే పంపిణీ
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో 48.92 లక్షల మంది (74%) బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్టు గుర్తించామని.. వీరందరికీ పింఛను మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వెల్లడించారు. మిగతా 16.58 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి అందిస్తామన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానపడిన వారు, వీల్‌ఛైర్‌లకు పరిమితమైనవారు, సైనిక పింఛన్లు తీసుకునే వారితోపాటు ఖాతా లేనివారికి ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1నుంచి 5వ తేదీ వరకు పింఛను పంపిణీ ఉంటుందని తెలిపారు. ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను, బ్యాంకర్లను ఆదేశించామని వివరించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున పింఛనుదారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ఈసీ సూచించిందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని